చట్టం ప్రకారం, surety అనుమతి లేకుండా creditor మరియు principal debtor మధ్య ఒప్పందంలోని షరతుల్లో మార్పులు (variance) చేసినట్లయితే, ఆ మార్పుల తరువాత జరిగే లావాదేవీలకు సంబంధించిన బాధ్యతల నుంచి surety (హామీదారు) విడుదల కావచ్చు.

సాధారణంగా చెప్పాలంటే, creditor మరియు borrower అసలు ఒప్పందాన్ని surety (హామీదారు) అనుమతి లేకుండా మార్చితే, ఆ మార్పుల వల్ల ఏర్పడే బాధ్యతల నుంచి surety (హామీదారు) విముక్తి పొందవచ్చు.


ముఖ్యమైన మార్పు (Material Alteration) అవసరం

ప్రతి చిన్న లేదా సాంకేతిక మార్పు వల్ల surety (హామీదారు) విడుదల కాలేడు. కోర్టులు దీనిని “Materiality Rule” ఆధారంగా పరిశీలిస్తాయి.

Materiality Rule

సాధారణ, చిన్న లేదా పరిపాలనా సంబంధమైన మార్పులు surety (హామీదారు)ని విడుదల చేయవు. మార్పు నిజంగా గణనీయమైనదై ఉండాలి. అంటే, ఆ మార్పు వల్ల:

  • బాధ్యత యొక్క స్వభావం,
  • బాధ్యత పరిమాణం, లేదా
  • surety తీసుకున్న ప్రమాద స్థాయి

గణనీయంగా ప్రభావితమవాలి.

ముఖ్యమైన మార్పుల ఉదాహరణలు:

  • రుణ మొత్తాన్ని పెంచడం,
  • చెల్లింపు విధానాన్ని మార్చడం,
  • అనుమతించిన పరిమితికి మించి క్రెడిట్ ఇవ్వడం,
  • వడ్డీ లేదా భద్రతా నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేయడం.

Prospective Discharge (భవిష్యత్ బాధ్యతల నుంచి విడుదల)

Surety (హామీదారు)కి లభించే విడుదల సాధారణంగా భవిష్యత్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.

అంటే:

  • అనుమతి లేకుండా చేసిన మార్పుల తరువాత జరిగే లావాదేవీల విషయంలో మాత్రమే surety విడుదల అవుతాడు;
  • కానీ, ఆ మార్పులకు ముందు ఉన్న బాధ్యతలు లేదా డిఫాల్ట్‌ల విషయంలో మాత్రం surety (హామీదారు) బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అందువల్ల, భవిష్యత్ బాధ్యతల నుంచి విడుదల జరిగినప్పటికీ, గత బాకీలు బాధ్యతలు అలానే ఉంటాయి.


నష్టం జరిగినట్టు నిరూపించాల్సిన అవసరం లేదు

Surety (హామీదారు)కి లభించే రక్షణ సంపూర్ణమైనది (absolute protection).

ఒప్పంద మార్పు వల్ల నిజంగా నష్టం జరిగిందని surety నిరూపించాల్సిన అవసరం లేదు. ఆ మార్పు surety(హామీదారు)కి ప్రయోజనకరంగా కనిపించినప్పటికీ కూడా, surety(హామీదారు) విడుదల కావచ్చు. ఎందుకంటే చట్టం ప్రకారం surety(హామీదారు) ఒక నిర్దిష్టమైన ఒప్పంద ప్రమాదాన్ని మాత్రమే అంగీకరించి గ్యారంటీ ఇచ్చాడని భావిస్తుంది.


Implied Consent (పరోక్ష సమ్మతి)

కొన్ని సందర్భాల్లో కోర్టులు surety (హామీదారు) ప్రవర్తన ఆధారంగా “implied consent” ఉందని భావించవచ్చు. ఉదాహరణకు, surety(హామీదారు):

  • మార్పుల గురించి తెలిసి ఉండటం,
  • మార్పు చేసిన ఏర్పాటును అంగీకరించడం, లేదా
  • మార్పుల విషయం తెలిసినా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా కొనసాగడం

వంటి పరిస్థితుల్లో, కోర్టు surety పరోక్షంగా సమ్మతి తెలిపాడని నిర్ణయించవచ్చు.

అలాగే, చాలా guarantee agreementsలో భవిష్యత్ మార్పులు, గడువు పొడిగింపులు లేదా restructuringకి అనుమతించే clauses కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో చట్టపరమైన రక్షణ అందకపోవచ్చు.


సుప్రీంకోర్టు అభిప్రాయం

Bhagyalaxmi Co-operative Bank Ltd. v. Babaldas Amtharam Patel కేసులో సుప్రీంకోర్టు, surety అనుమతి లేకుండా ఒప్పందంలోని ముఖ్యమైన మార్పులు చేస్తే, surety తరువాతి బాధ్యతల నుంచి విడుదల కావచ్చని మరోసారి స్పష్టం చేసింది.

కోర్టు అభిప్రాయం ప్రకారం, surety(హామీదారు) మొదట అంగీకరించిన పరిమితిని, surety(హామీదారు)కె తెలియకుండా/అనుమతి లేకుండా అధికంగా మార్పు చేసిన ఒప్పందాలకు surety (హామీదారు)ని బంధించలేరు.