Agent చేసిన పనులకు Principal బాధ్యత వహించాలా?
ఒక వ్యక్తిని (Principal) తన తరుపున వ్యవహరించడానికి మరో వ్యక్తిని (Agent) నియమించారని అనుకుందాం. Agent, Principal తరుపున మూడో వ్యక్తితో మాట్లాడవచ్చు, ఒప్పందం చేసుకోవచ్చు లేదా కొన్ని హామీలు ఇవ్వవచ్చు.
అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది:
Agent తనకు ఇచ్చిన అధికారానికి మించి ఏదైనా హామీ ఇచ్చినా, లేదా ఏదైనా పని చేసినా, దానికి Principal కూడా బాధ్యత వహించాలా?
సుప్రీంకోర్టు చెప్పిన ముఖ్యమైన సూత్రం — ప్రతిసారీ కాదు.
Agentకు ఉన్న అధికారం, Principal అతనికి ఇచ్చిన అధికార పరిమితులకు లోబడి ఉంటుంది.
Agent తన అధికారాన్ని మించి ఏమి చేయలేడు?
Agent:
- Principal బాధ్యతను తనంతట తానే పెంచలేడు;
- తనకు ఇచ్చిన అధికారానికి మించి కొత్త Risk లేదా బాధ్యతను సృష్టించలేడు;
- Principal కూడా చట్టపరంగా చేయలేని పనిని Agent ద్వారా చేయించలేడు;
- తప్పనిసరి చట్టపరమైన నిబంధనను Agent తన హామీ ద్వారా పక్కన పెట్టలేడు.
అందువల్ల, Agent ఏదైనా చెప్పాడని లేదా హామీ ఇచ్చాడని మాత్రమే Principal తప్పనిసరిగా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
సాధారణంగా, Agent కు ఇచ్చిన అధికారం ఎంతవరకు ఉందో, ఆ పరిమితుల్లో Agent చేసిన పని Principal ను బంధిస్తుంది.
సుప్రీంకోర్టు తీర్పు
ఈ సూత్రాలను సుప్రీంకోర్టు The New India Assurance Company Ltd. & Ors. v. M/s Louis Dreyfus Commodities India Pvt. Ltd. కేసులో పరిశీలించింది.
ఈ కేసులో, New India Assurance Company వద్ద Marine Cargo Annual Turnover Policy తీసుకున్న సంస్థకు సంబంధించిన సరుకులు అగ్నిప్రమాదంలో దెబ్బతిన్నాయి.
Policy లో insured turnover ₹1,200 కోట్లు కాగా, అగ్నిప్రమాదం జరిగిన సమయానికి turnover ₹1,724.12 కోట్లకు పెరిగింది. ఆ సమయంలో అదనపు premium చెల్లించలేదు.
తర్వాత, Insurance Company కి చెందిన అధికారుల నుంచి వచ్చిన communication ఆధారంగా అదనపు premium చెల్లించబడింది. ఆ communication లో turnover ను “regularise” చేయడానికి additional premium చెల్లించాలని కోరారు.
అయితే, అగ్నిప్రమాదం జరిగిన తర్వాత additional premium చెల్లించడం ద్వారా, ప్రమాదం జరిగిన తేదీ నుంచే అదనపు insurance coverage ఏర్పడిందని చెప్పవచ్చా అనే ప్రశ్న తలెత్తింది.
సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించలేదు.
Agentకు implied authority ఉన్నంత మాత్రాన సరిపోదు
Justice Nongmeikapam Kotiswar Singh తన concurring judgmentలో Principal–Agent సంబంధాన్ని Indian Contract Act, 1872లోని Sections 182, 186, 187, 188, 226, 227 మరియు 237 నేపథ్యంలో పరిశీలించారు.
ఒక అధికారి ఒక policy ని administer చేయడం, insured తో correspondence చేయడం లేదా premium కోరడం వంటి సాధారణ పనులు చేయవచ్చు.
కానీ దాని వల్ల అతనికి:
- కొత్త Risk సృష్టించే అధికారం,
- insured amount పెంచే అధికారం,
- Insurance Company's liability ని పెంచే అధికారం, లేదా
- తప్పనిసరి statutory requirement ను పక్కన పెట్టే అధికారం
స్వయంచాలకంగా లభించదు.
సుప్రీంకోర్టు చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, Agent తనకు తానే authority ని సృష్టించుకోలేడు.
Agent కు authority ఉందని అతను స్వయంగా చెప్పడం మాత్రమే సరిపోదు. ఆ authority Principal చేసిన మాటలు, ప్రవర్తన, గత వ్యవహార విధానం లేదా Agent కు ఇచ్చిన organizational position నుంచి కనిపించాలి.
Principal ను Agent చేసిన ప్రతి పని బంధిస్తుందా?
లేదు.
Agent Principal తరుపున చేసిన పని, అతనికి ఇచ్చిన authority పరిధిలో ఉంటే, సాధారణంగా అది Principal చేసినట్టే చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
కానీ Agent తన అధికారాన్ని దాటి Principal పై కొత్త లేదా అదనపు బాధ్యతను మోపలేడు.
అదే విధంగా, చట్టం స్వయంగా Principal చేయడానికి అనుమతించని పనిని Agent తన హామీ ద్వారా చెల్లుబాటు చేయలేడు.
ఈ కేసులో సుప్రీంకోర్టు Section 64VB of the Insurance Act కింద premium చెల్లింపుకు సంబంధించిన statutory requirement ను కూడా ముఖ్యంగా పరిగణించింది. చట్టం తప్పనిసరిగా నిర్దేశించిన షరతును Agent ఇచ్చిన హామీ ద్వారా పక్కన పెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది.
అయితే మరో ముఖ్యమైన ప్రశ్న:
Principal తరుపున Agent ఒక Contract చేసుకున్నప్పుడు — ఆ Contract ను Agent స్వయంగా Courtలో అమలు చేయించుకోగలడా?
సాధారణంగా — లేదు/కుదరదు.
ఇక్కడ Section 230, Indian Contract Act, 1872 ముఖ్యమైనది.
Principal తరుపున Agent ఒక Contract చేసుకున్నప్పుడు, సాధారణ నియమం ప్రకారం Agent ఆ Contract ను తన వ్యక్తిగత హక్కుగా Court లో enforce చేయలేడు.
ఎందుకంటే Agent ఆ Contract ను తన కోసం కాకుండా Principal తరుపున చేసాడు.
సరళంగా చెప్పాలంటే:
Agent Contract చేసాడు
↓
కానీ Principal తరుపున చేసాడు
↓
అందువల్ల Contract ద్వారా వచ్చే హక్కు సాధారణంగా Principal దే
↓
Agent తన పేరుతో ఆ Contract ను enforce చేయలేడు.
Section 230 లో కొన్ని Exceptions ఉన్నాయి
అయితే ఇది absolute rule కాదు. Section 230లో కొన్ని పరిస్థితుల్లో Agent వ్యక్తిగతంగా Contract ను enforce చేయగల పరిస్థితులు గుర్తించబడ్డాయి.
ఉదాహరణకు:
- Principal విదేశంలో ఉన్న Merchant అయితే;
- Principal పేరు disclose చేయకపోతే;
- Principal పేరు disclose చేసినప్పటికీ, అతనిపై suit వేయలేని పరిస్థితి ఉంటే;
- Agent కు Contract లో ప్రత్యేకంగా వ్యక్తిగత హక్కు కల్పించబడినట్లయితే, ఆ Contract యొక్క terms ను బట్టి పరిస్థితి మారవచ్చు.
అందువల్ల, ప్రతి కేసులో Contract లోని terms మరియు Agent యొక్క actual legal position ను పరిశీలించాలి.
Agent కు Authority ఉండటం, Agent కు Personal Right ఉండటం — రెండూ ఒకటే కాదు
ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తుంచుకోవాలి.
Agent కు Contract చేయడానికి Authority ఉండటం ఒక విషయం.
ఆ Contract ను Agent తన పేరుతో Courtలో enforce చేసే హక్కు ఉండటం మరో విషయం.
ఒక Agent Principal తరుపున చెల్లుబాటు అయ్యే Contract చేయవచ్చు. ఆ Contract Principalను bind చేయవచ్చు. కానీ అందువల్ల మాత్రమే Agent కు ఆ Contract పై personal right to enforce వచ్చిందని చెప్పలేం.
ఈ Supreme Court Judgment ఏం నిర్ణయించింది?
The New India Assurance Company Ltd. & Ors. v. M/s Louis Dreyfus Commodities India Pvt. Ltd. తీర్పు ప్రధానంగా Agent కు ఉన్న authority ఎంతవరకు Principal ను bind చేయగలదు అనే అంశంపై ఉంది.
ఈ తీర్పు Agent specific performance suit వేయగలడా లేదా అనే ప్రశ్నను నేరుగా నిర్ణయించలేదు.
Agent ఒక Contract ను తన పేరుతో Court లో enforce చేయగలడా అనే ప్రశ్నకు Section 230, Indian Contract Act, 1872 ప్రధాన provision. కొంత వరకు పైన పేరా లో వివరించడం జరిగినది.
చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం
Agent Principal తరుపున పనిచేస్తాడు.
అతనికి ఇచ్చిన authority పరిధిలో చేసిన పని Principal ను బంధించవచ్చు. కానీ Agent తనకు లేని authority ని తనంతట తానే సృష్టించుకోలేడు. అలాగే Principal తరుపున చేసుకున్న Contract ను Agent తన వ్యక్తిగత హక్కుగా enforce చేయగలడని కూడా కేవలం Agent అనే కారణంతో చెప్పలేం.
Disclaimer: This article is intended solely for general awareness and educational purposes. It does not constitute legal advice. The outcome of every case depends upon its own facts, evidence, and applicable law.